వివేకా హత్యకేసులో జరుగుతున్న పరిణామాలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ.... ‘హ్యాట్సాఫ్ సునీత రెడ్డి.. కంటే కూతురినే కనాలి’ అని అన్నారు. గురువారం ఉదయం సీనియర్ న్యాయవాది సిదర్ధాలుత్రా సుప్రీంకోర్టులో కేసు మెన్షన్ చేశారు. హైకోర్టు ఆర్డర్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. శుక్రవారం ఈ కేసును న్యాయస్థానం విచారించనుంది. హైకోర్టు తీర్పుపై ప్రజలు ఇదేమి తీర్పు అని అనుకున్నారని.. కానీ న్యాయస్థానాన్ని నమ్మాలని తాను విజ్ఞప్తి చేశానన్నారు. సునీత రెడ్డి సుప్రీంకోర్టుకు వస్తారని అవినాష్ రెడ్డి అనుకోలేదన్నారు. సీబీఐ, చంద్రబాబు కుమ్మక్కయ్యారని సజ్జల, వైసీపీ నేతలు అంటున్నారని, చంద్రబాబు అల చేస్తే జగన్ బయట తిరిగే వారా? ఒక్క రోజు కూడా కోర్టుకు వెళ్లకుండా ఉండే వారా? అని అన్నారు. సునీత రెడ్డి మౌనంగా న్యాయపోరాటం చేస్తుందని అయన అన్నారు.