సచివాలయ సిబ్బంది బాధ్యతగా పని చేయాలని ఎంపీడీఓ శ్రీదేవి తెలిపారు. గంగాధర నెల్లూరు మండలం, పెద్దకాల్వ గ్రామ సచివాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని, ఫిర్యాదు చేసిన సమస్యలను ఆన్లైన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఏకాంబరం, ఈఓపి ఆర్డీ శివయ్య, సిబ్బంది పాల్గొన్నారు.