నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డు రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి నేతల మధ్య సుదీర్ఘంగా పలు అంశాలపై మాటామంతి సాగుతోంది. నెల్లూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా ఇప్పటివరకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుడైన కూకటి హరిబాబు వ్యవహరిస్తున్నారు. ఆదాలను నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించిన కోకట హరిబాబు మాత్రం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైపు అడుగులు వేయడంతో ఎలాగైనా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గాన్ని దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఆదాల అడుగులు పడుతున్నాయి.