శ్రీకాకుళం రూరల్ మండలం నీలం జూట్ మిల్ వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్ అక్కడకక్కడే మృతి చెందిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే శుక్రవారం తెల్లవారుజామున శ్రీకాకుళం నుండి నిమ్మడ గ్రానైట్ పరిశ్రమకు గ్రానైట్ రాయిని తీసుకుని వెళుతున్న లారీ ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. గ్రానైట్ తో వెళుతున్న లారీ ముందు వెళుతున్న లారీని ఢీకొట్టడంతో గ్రానైట్ రాయి ముందుకు వాలిపోవడంతో ఆ లారీలో ఉన్న డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతుని యొక్క వివరాలు ఇంకా తెలియ రావలసి ఉంది. ఈ మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.