మంగళగిరి నగరంలోని బీఎం డబ్ల్యూ షోరూం ఎదురుగా ఉన్న ఓ చిరు దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దుకాణం మొత్తం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న మంగళగిరి అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే దుకాణంలోని వస్తువులు, ఫర్నిచర్ తగలబడినట్లు దుకాణ యజమాని చింత క్రింది శివ తెలిపారు. తాను చిన్నదుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నానని ఉన్న దుకాణం అగ్నికి ఆహుతి అవటంతో రోడ్డును పడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 1. 5 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ఆయన తెలిపారు.