చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని మాజీ సైనికులు, వితంతు సైనికులకు 175 చదరపు అడుగుల ఇళ్ల స్థలాన్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇస్తామని జిల్లా సైనిక సంక్షేమాధికారి విజయశేఖర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తి కలిగిన వారు ఈ నెల 24వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.