కడప నగరంలోని 23వ డివిజన్ నందు కార్పొరేటర్ విజయలక్ష్మి, డివిజన్ ఇంఛార్జి ఐస్ క్రీమ్ రవీంద్రారెడ్డిల ఆధ్వర్యంలో డివిజన్ మైనారిటీ ప్రజలకు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శుక్రవారం నిత్యవసర సరుకులు (రంజాన్ తోఫాను) డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, కడప నగర మేయర్ సురేష్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రంజాన్ మాసంలో పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం ఎంతో సంతోషదాయకమన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, నాయకురాలు పాల్గొన్నారు.