మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్‌కు ఊరట లభించింది. సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌కి అప్లై చేసుకోగా తెలంగాణ హైకోర్టు ఆయన అరెస్టుపై స్టే విధించింది. శుక్రవారం వరకు అరెస్టు చేయవద్దని చెప్పింది. కాగా, తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సోమవారం వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. అన్ని విషయాలను పరిశీలిస్తామని చెప్తూ విచారణను వాయిదా వేసింది.