తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకాశం జిల్లా, మార్కాపురంలో అన్నదాతలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు, కౌలు రైతుల జీవితాలు మార్చేందుకు టీడీపీ హయాంలో చాలా చేశామన్నారు. యాంత్రీకరణ, సబ్సిడీలు, గిట్టుబాటు ధరల ద్వారా రైతులకు మేలు చేశామని, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చిరుధాన్యాలు, ఆక్వా ఉత్పత్తులకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. పాడి పరిశ్రమకు కూడా డిమాండ్ పెరిగిందని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.