ముస్లిం సోదర సోదరీమణులకు మాజీ మంత్రి అమరనాథ రెడ్డి పవిత్ర రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆదోనిలో ఉన్న ఆయన శనివారం ఒక ప్రకటనలో ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి పవిత్ర రంజాన్ పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆ అల్లా చల్లని చూపు చూడాలని, అందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.