పదేళ్లలో దాదాపుగా 300 మంది రోగులను చంపేసినట్లు ఓ వ్యక్తి చెప్పిన వీడియో తమిళనాడులో కలకలం రేపింది. పళ్లి పాలయానికి చెందిన మోహన్రాజ్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి శవాగారం వద్ద పని చేస్తున్న వ్యక్తితో కలిసి అతడు చెప్పే పనులు చేస్తుంటాడు. ఈక్రమంలో వయోభారం, ఆరోగ్యం క్షీణించిన రోగులకు వారి కుటుంబీకుల కోరిక మేరకు సూదితో విషపు మందు వేసి హత్య చేస్తున్నట్లు, దీనికి రూ. 5 వేలు తీసుకుంటున్నట్లు ఓ వీడియోలో పేర్కొన్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, మద్యం మత్తులో అలా మాట్లాడినట్లు పేర్కొన్నాడు.