ప్రతి రోజూ సోషల్ మీడియోలా చాలా వైరల్ అవుతుంటాయి. తాజాగా, కొందరు వృద్ధ మహిళలు వీధుల్లో ఉత్సాహంగా స్కేటింగ్ చేస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీరు 70 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న వారేనని తెలుస్తోంది. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు అనుమానం వ్యక్తం చేయగా, ఇవి ఏఐతో రూపొందించినవని పోస్ట్ చేసిన వ్యక్తి స్పష్టత ఇచ్చారు. దీంతో ఇవి నిజమైనవేనని తాము భావించినట్లు చాలామంది కామెంట్స్ చేశారు.