కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి శనివారం రాత్రి ఆస్పత్రిలో చేరారు. జ్వరం, అలసటతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. త్వరలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం వల్ల కుమారస్వామి అస్వస్థతకు గుర్యయారు.