రైలు నం. 18005/18006 (హౌరా-జగ్దల్పూర్-హౌరా)సామలేశ్వరి ఎక్స్ప్రెస్కు సంబల్పూర్ డివిజన్లోని అంబడోలా స్టేషన్లో ఈనెల 23 నుండి ఆరు నెలల పాటు రైలును ప్రయోగాత్మకంగా నిలిపేందుకు రైల్వే బోర్డు నిర్ణయించిందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ కె త్రిపాఠి శనివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈమేరకు రైలు నెం. 18005 హౌరా-జగ్దల్పూర్ సామలేశ్వరి ఎక్స్ప్రెస్ అంబడోలాలో ప్రతిరోజూ 13. 15 గంటలకు ఆగుతుందని 23 నుండి అక్టోబర్ 22వరకు ప్రభావంతో 13. 17 గంటలకు బయలుదేరుతుందన్నారు. రైలు నెం. 18006 జగదల్పూర్-హౌరా సామలేశ్వరి ఎక్స్ప్రెస్ అంబడోలాలో ప్రతిరోజూ 12. 45 గంటలకు ఆగుతుందని 23 నుండి అక్టోబర్ 22 వరకు ప్రభావంతో 12. 47 గంటలకు బయలుదేరుతుందన్నారు.