అచ్యుతాపురంలో వైభవంగా రంజాన్ పండుగను శనివారం భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన ఉపవాస దీక్షల అనంతరం ఈద్- ఉల్-పితర్ గా పిలుచుకునే రంజాన్ పండుగ సందర్భంగా గౌస్ మొహిద్దిన్ మస్జిద్ లో అచ్యుతాపురం, మండలంలో ముస్లిం సోదరులు వేల సంఖ్యల్లో పాల్గొని అందరికి మంచి జరగాలని సామూహిక ప్రార్థనలు చేశారు. పండుగలోని ప్రధానంగా చెప్పుకునే జకాత్‌ను దృష్టిలో ఉంచుకుని పేదవారికి డబ్బులు దానం చేశారు. ఇక మహిళలు ఇంట్లోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పండగను పురుస్కరించుకుని సన్నిహితులకు ఇంట్లోకి పిలిచి ప్రత్యేక వంటకాలను రుచిచూపించారు. పండుగ ప్రత్యేకమై షీర్ కుర్మాను తాగించారు. ప్రశాంత వాతావరణంలో పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.