కడప నగరాభివృద్ధిపై ఉపముఖ్యమంత్రి అంజా ద్ భాషకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. కడప నగరంలోని పాతబస్టాండు నుంచి రవీంద్రనగర్ కు వెళ్లే మార్గంలో ఉన్న హైలెవల్ వంతెన వద్ద సోమవారం ఆయన సెల్ఫీ తీసుకుని సవాలు విసిరారు. గత 15 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న హైలెవల్ వంతెనను తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉండగానే ప్రత్యేక శ్రద్ధవహించి నిర్మించామన్నారు. కేవలం మూడు నెలల్లోనే నిర్మించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చేశామన్నారు. అధికారంలోనికి వచ్చి నాలుగేళ్లు పూర్తిచేసుకున్న వైసీపీ ప్రభుత్వం, ఉపముఖ్య మంత్రి కడప నగరంలో ఏం అభివృద్ధి తెలపాలని డిమాండు చేశారు. వైసీపీ నాయకులకు ధైర్యం ఉంటే తాము చేసిన అభివృద్ధిపై సవాలును స్వీకరించాలని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.