గుంటూరు: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఫాతిమాపురం 2వ లైన్ లో నివసించే గురజాల లక్ష్మికి మతిస్థిమితం సరిగా ఉండదు. మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిమీద కిరోసిన్ పోసుకొని నిప్పండించుకుంది. కేకలు విని మంటలు ఆర్పి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.