ద్విచక్ర వాహనాలను చోరీ చేసే వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఎస్. ఐ. హరిప్రసాద్ కథనం మేరకు. నెల్లూరు జిల్లా , ముదివర్తిపాళెనికి చెందిన దొడ్ల సంతోష్ గతంలోనే పలు ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నిందితుడిగా జైలులో ఉండి బెయిల్పై బయటికి వచ్చి, పూతలపట్టులోని ఐఓసీలో మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు. పూతలపట్టులో నివాసం ఉంటూ తిమ్మిరెడ్డిపల్లె, పి. కొత్తకోట, పూతలపట్టులో 3 ద్విచక్ర వాహనాలను చోరీ చేయడంతో పోలీసులు అతని అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టు చూపుతున్న పోలీసులు చేశారు. నిందితుడిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు.