ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేతలు దారుణంగా కొట్టుకున్నారు. ఘజియాబాద్‌లో కౌన్సిలర్ల స్థానాలకు బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత టికెట్ల పంపిణీపై నేతల మధ్య వివాదం మెుదలైంది. దీంతో మురాద్‌నగర్ ఎమ్మెల్యే అజిత్ పాల్ త్యాగి కార్యాలయంలో బీజేపీ నేతలు చితక్కొట్టుకున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ, తిట్టుకుంటూ తన్నుకున్నారు. దీంతో సీనియర్ నేతలు, పోలీసులు వారిని అడ్డుకుని సర్దిచెప్పారు.