శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని 15, 16 వార్డు సచివాలయాలను హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ మంగళవారం అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 15, 16, వార్డు సచివాలయలలోని రికార్డులను తనిఖీ చేసి హాజరు పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించే బాధ్యత మీ అందరిపై ఉన్నదని విధులలో నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో స్పందించి ప్రజలకు సంక్షేమ ఫలాలు చేరే విధంగా చూడాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందన్నారు.