ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం ఈ నెల 27 న గుడ్లూరు మండలంలో జరగనుంది. స్థానిక మండలంలోనే దారకానిపాడు గ్రామంలో గురువారం ఉదయం 6: 30 గంటలకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరగనున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డి బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి హాజరుకానున్నారు. కావున మండలంలోని అధికారులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఎంపీడీఓ కోరారు.