పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు ధరణికోటలో ముస్లిం సోదరులతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం ధరణికోట నుంచి సత్తెనపల్లి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం సత్తెనపల్లిలో చంద్రబాబు రోడ్ షో జరుగనుంది. ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరుతో సత్తెనపల్లిలో భారీ బహిరంగ సభలో పాల్గంటారు. ఈరోజు సత్తనపల్లిలోనే చంద్రబాబు బస చేయనున్నారు. అయితే సత్తెనపల్లిలో బహిరంగ సభకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్న తరుణంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.