బద్వేలులో మే 6, 7 తేదీల్లో నిర్వహించే డివైఎఫ్ఐ యువజన సంఘం జిల్లా స్థాయి శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ జిల్లాకార్యదర్శి వీరనాల శివకుమార్ తెలిపారు. బుధవారం ప్రొద్దుటూరు స్థానిక కార్యాలయంలో శిక్షణా తరగతులకు సబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో పట్టణాద్యక్షుడు వెంకటేష్, సాగర్, నాగేంద్ర పాల్గొన్నారు.