సైబర్ నేరాలు పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి వైయస్సార్ కడప జిల్లా పెద్దముడియం మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలోని సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ప్రజలకు అవగాహన కల్పించారు.