ఏపీ ప్రభుత్వం 2020లో విడుదల చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో నియామకమై, ఇటీవల ప్రొబేషన్ ఖరారైన ఉద్యోగులకు కొత్త జీతాలు అందనున్నాయి. మే 1 నుంచి పెరిగే కొత్త వేతనాలు వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, ప్రొబేషన్ ఖరారైన ఉద్యోగులకు వారి హోదాను బట్టి నిర్ణయించిన కొత్త జీతాల వివరాలను అందులో పేర్కొంది.