ఇచ్చాపురం మండల కేంద్రానికి ఒకటి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు వచ్చాయని ఎంఈఓ కురమాన అప్పారావు శనివారం ప్రకటించారు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను మొదటి విడతగా 31, 123 పాఠ్యపుస్తకాలు వచ్చాయన్నారు. వీటిని జగనన్న విద్యా కానుక స్టాక్ పాయింట్ వద్ద భద్రపరిచామన్నారు. పాఠశాలల వేసవి సెలవులు అనంతరం పున: ప్రారంభం నాటికి విద్యార్థులకు పంపిణీ చేస్తామన్నారు.