జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం హైదరాబాద్లోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముందస్తు సమాచారం లేకుండానే వారిద్దరూ కలిశారని ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలల క్రితం చంద్రబాబుతో పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాజా భేటీలో పొత్తులపై నిర్ణయం వెలువడుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.