విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటు పరం కాకుండా కాపాడుకుంటామని కూర్మన్నపాలేం జాతీయ రహదారిని ఉక్కు పోరాటకమిటీ దిగ్భందించారు. మోడీ. అధానీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాణత్యాగాలతో సాధించి, నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్ ను అమ్మాలని చూస్తే ఊరుకోమని అన్నారు. రాస్తారోకో చేసిన పోరాట కమిటీ నాయకులను, కార్మికులనుపోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నీరుకొండ రామచంద్రరావు, ఆదినారాయణ, అయోధ్యరాం, కార్మికులు తదితరులున్నారు.