విశాఖ ఆరిలోవ ప్రాంతంలో బుదవారం మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఈమేరకు అప్పుడే పుట్టిన పసికందు ను కాగితం లోచుట్టేసి మెడ పై నుండి విసిరేసిన ఘటన ఆరిలోవ తోటగురువు లో స్థానికంగా సంచలనం సృష్టించింది. ఘటనకు సంబందించి ఆరిలోవ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విశయం తెలుసుకున్న శిశు సంక్షేమ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాకినాడ కు చెందిన యువతి యు దివ్య ( 20 ) తల్లిదండ్రులు లేకపోవటంతో ఒంటరి గ ఉంటుంది. ఈక్రమంలో విశాఖ ఆరిలోవ రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన యువకుడితో పరిచయం ఎర్పడింది దింతో తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని విశాఖ ఆరిలోవ తోటగురువు ప్రాంతంలో ఉంచాడు. ఇదిలా ఉండగ బుదవారం యువతికి నొప్పులు రావడం తో ఒక శిశువుకి జన్మనిచ్చింది అయితే తాను గర్భవతి నని తనకు తెలియదని కడుపు నొప్పి వచ్చి ఏదో ఒక కాయల బయటకి వస్తే తీసి పక్కన పెట్టినట్లు యువతి అంటుంది. ప్రస్తుతం మృత శిశువుతో పాటుగా యువతిని కేజి హెచ్ కు తరిలించారు.