పీలేరు కోర్టు ఆవరణంలో ఈనెల 13న జరిగే జాతీయ లోక్ పదాలత్ ను విజయవంతం చేయాలని పీలేరు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు నాయక్ తెలిపారు. బుధవారం స్థానిక కోర్టులో పోలీస్ అధికారులు, న్యాయవాదులతో జరిగిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడుతూ ఈనెల 13న రెండవ శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. కక్షి దారులు, బ్యాంకర్లు, న్యాయవాదులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజీకి సాధ్యమైన క్రిమినల్, కాంపౌండ్ కేసులు, సివిల్, మోటార్ వాహన కేసులు, కుటుంబ తగాదాల కేసులు, మొదలైనవి ఈ జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే పోలీస్ అధికారులు తమ తమ స్టేషన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కరించుకునేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపిపి శారద, పీలేరు సిఐ మోహన్ రెడ్డి, ఎక్సైజ్ సిఐ గురు ప్రసాద్, ఇతర స్టేషన్ అధికారులు, కోర్టు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.