ప్రమాదవసత్తు ఉయ్యాల నుండి రుబ్బురోలు పై పడి ఊపిరాడక చిన్నారి మృతి చెందిన ఘటన వేపనపల్లిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే , చిత్తూరు మూడో గేటు వేపనపల్లికి చెందిన హారిక (10) ఇంట్లో ఉయ్యాలలో ఆడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న రుబ్బురోలు పై వేగంగా పడడంతో, మో చేయి విరిగి కాళ్లకు తీవ్ర గాయాలు, తల తిరిగి ఊపిరాడక ఉండడంతో కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.