స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై , కమ్యూనిస్టు పార్టీలు, ఉక్కు పోరాట కమిటీ. పులుపు మేరకు గాజువాక నియోజకవర్గం పరిది పేదగంట్యాడ కూడలి వద్ద బుదవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మేల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాగిరెడ్డి మాట్లాడుతూ, అన్ని రాజకీయ పార్టీలు , ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి పోరాటం ఉదృతం చేసి కేంద్రం పై పోరాడి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైందని. అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు. జెర్రిపోతుల ముత్యాలు గాజువాక కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త తిప్పల దేవన్ రెడ్డి , గాజువాక వైఎస్సార్సీపీ సమన్వయ కర్త దల్లి గోవిందరెడ్డీ, జనసేన కార్పురేటర్ నమ్మి సింహాద్రి, ఏళ్లేటి శ్రీను, అప్పారావు, మర్పుడి పరదేష్ , గణపతి రెడ్డి, రమణారెడ్డి, పులి రమణారెడ్డి, బొడ్డు పైడి రాజు, దొమ్మెటి అప్పారావు, మంత్రి శంకర నారాయణ, నందితి తాతారావు, పిట్టా రెడ్డి, కనకయ్య రెడ్డీ, మంత్రిగోపీ, కోవిరి కోదండ రావు, యరబాల భూలోక, నమ్మి అప్పలనాయుడు , వర్మ, మరియు వివిధ సంఘాలు ప్రతినిదులు పాల్గొన్నారు