లావేరు: మండలంలోని బుడుమూరు వద్ద బుధవారం ఉదయం విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందిన గేదేల భరత్ కుమార్(27) అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మధురవాడకు చెందిన భరత్ కుమార్ మంగళవారం రాత్రి స్నేహితు భరత్‌కుమార్ మృతదేహంలతో కలిసి శ్రీకాకుళం వచ్చాడు. తనకు పని ఉందని మధురవాడ వెళ్లిపోతానని చెప్పడంతో స్నేహితులు శ్రీకాకుళంలో బుధవారం వేకువజామున ప్రైవేటు బస్సు ఎక్కించారు.
ఇంతలో ఏంజరిగిందో గానీ లావేరు మండలం బుడుమూరు వద్ద జాతీయరహదారిపై భరత్ కుమార్ అనుమానాస్పద రీతిలో మృతి చెంది ఉన్నాడు. విషయం తెలుసుకున్న లావేరు పోలీసులు భరత్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. భరత్‌కుమార్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. లావేరు పోలీసులు కేసు నమోదు చేశారు.