పొన్నూరు మండలం ఆరెమండ గ్రామంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. గ్రామంలో ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి పాంప్లెట్ చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని ఇంటింటికి ప్రచారం చేశారు. కార్యక్రమంలో గ్రామ తెదేపా నాయకులు పాల్గొన్నారు.