పశ్చిమ నియోజకవర్గం 91వ వార్డు 481 సచివాలయం పరిధిలో గల పాత గోపాలపట్నంలో పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఏపి. ఎమ్. ఎస్. ఎమ్. ఈ.డి.సి. చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ సొంత నిధులతో బుధవారం ఇస్తున్న పెన్షన్లను జీవీఎంసీ కో ఆప్షన్ మెంబర్ బెహరా భాస్కరరావు ఆధ్వర్యంలో 91వ వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసరావు 92 వ వార్డు అధ్యక్షులు జి అప్పలస్వామి నాయుడు చేతులమీదుగా ఐకా లక్ష్మి, ఉప్పాటి హిమ శైలజ, బండి పెద్దింటమ్మ, బర్ల జగదీశ్వరరావు లకు 2, 750 చప్పున నలుగురికి పెన్షన్ అమౌంట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో బల్లంకి వెంకట్రావు, ఓ అప్పలరాజు, ఉష, పసుపురెడ్డి రమణ, ఊటపల్లి గోవింద్, షేక్ వహీదా వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.