విజయనగరం నుండి నరసన్నపేట వస్తున్న కారు టైరు పంక్చర్ అయి లారీని ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలకు వెళితే నరసన్నపేట పట్టణానికి చెందిన పొట్నూరు క్రాంతి కుమార్ ఆయన తండ్రి గోవిందరావు పండ్ల వ్యాపారం చేస్తున్న సందర్భంగా విజయనగరం నుండి మామిడి పండ్లను తీసుకొని గురువారం ఉదయం నరసన్నపేట వస్తుండగా శ్రీకాకుళం ఎన్ఏడి కొత్త రోడ్డు ఫ్లై ఓవర్ పై ఈ ఘటన జరిగింద ఈ ప్రమాదంలో క్రాంతి కుమార్ కు తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఎన్ హెచ్ ఫైవ్ అంబులెన్స్ లో హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్య సహాయం వైద్యులు అందజేశారు. తండ్రి గోవిందరావుకి స్వల్ప గాయాలు కావడంతో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జుయిపోయింది. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.