నర్సరీల్లో నారును కొనుగోలు చేస్తే బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని ములకలచెరువు ఉద్యానవనశాఖ అధికారి ఎస్. ప్రతాప్ రెడ్డి ఆదేశించారు. తంబళ్లపల్లె పనియోజకవర్గంలోని బి. కొత్తకోట, పీటీఎం, ములకలచెరువు, మండలాల్లోని ఆర్బీకే కేంద్రాల్లో వేర్వేరుగా బుధవారం ఉద్యానవనశాఖ సిబ్బంది, నర్సరీల యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు. నర్సరీల చట్టం అమలు చేసి రైతులు నష్టపోకుండా చూడాలన్నారు. ఈ-క్రాప్, ఈకేవైసీ, బిందుసేద్యంపై సమీక్షించారు.