కాకుమాను మండలంలో గురువారం ఉద్యానవన శాఖ ఏవో ఉష మండలంలోని కాకుమాను, బికే పాలెం, వల్లూరు గ్రామాలలో కల్లాల్లో తడిసిన మిరప పంటను పరిశీలించారు. వర్షపాతం ఎక్కువగా ఉండటంతో నష్టం వాటిల్లిందని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు త్వరలో పంట నష్టంఅంచనా వేస్తామని రైతులకు తెలిపారు. రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం రైతులందరికీ పూర్తిగా న్యాయం చేస్తుందని ఆమె అన్నారు. ప్రస్తుతం మిరప దిగుబడులు సురక్షిత ప్రాంతాలలో చేర్చి ఆరబెట్టుకోవాలని ఆమె సూచించారు. ఆమె వెంట ఉద్యానవన శాఖ సిబ్బంది పాల్గొన్నారు.