ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ నేలపాడు అమరావతి వారి ఆదేశాల మేరకు ఈనెల 13 న పొన్నూరు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం సత్య కుమారి గురువారం తెలిపారు. పొన్నూరు కోర్టుల ఆవరణలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నందు రాజీపడి తగిన క్రిమినల్ కేసులు , సివిల్ కేసులు , చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాల కేసులు మరియు ఫ్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవచ్చు అన్నారు. కక్షిదారులు వ్యయప్రయాసలకు లోనుకాకుండా ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవలసినది గా ఆమె కోరారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు ప్రత్యక్షముగా హాజరు కావచ్చునని ఆమె తెలిపారు. మరిన్ని వివరాలకు వాట్సాప్ నంబర్: 9492662537 లేదా మెయిల్ ఐడి: pnrmisc@yahoo. com నందు సంప్రదించవలసినదిగా ఆమె కోరారు.