గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఇంట్లో చోరీ జరిగిన ఘటనపై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బ్రాడీపేట 2/5లో నివసించే అవనిగడ్డ కల్యాణి గతనెల 10వ తేదీ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి ఊరు వెళ్లింది. బుధవారం ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని స్థానికులు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. గురువారం గుంటూరు వచ్చి ఇల్లు పరిశీలించగా బీరువాలోని రూ. 80 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.