ఉక్రెయిన్, రష్యా దేశాలు పోటాపోటీగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఇటీవల రష్యా అధ్యక్ష భవనంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగా.. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరంపై క్రెమ్లిన్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. అలాగే ఓ సూపర్ మార్కెట్‌తోపాటు రైల్వే స్టేషన్‌పై మిస్సైల్‌తో దాడి చేసింది. ఈ ఘటనలో 21 మంది ప్రజలు మృతి చెందగా, మరో 48 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.