ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని కొండపై వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో తిరునాళ్ల మహోత్సవం గురువారం ప్రారంభమైంది. తొలుత పట్టణంలోని రేడియోబావి కూడలిలోని అభయాంజనేయస్వామి దేవాలయం నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను భక్తులు మేళతాళాల మధ్య కొండపైకి తీసుకెళ్లారు. దేవాలయంలో అగ్గిసేవ కార్యక్రమంతో తిరునాళ్ల మహోత్సవం ప్రారంభమైంది. రాత్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తిరునాళ్ల మహోత్సవంలో, కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.