తండ్రి రోజూ తాగొచ్చి తనను, తల్లిని కొడుతున్నాడని రహీమ్ అనే తొమ్మిదేళ్ల బాలుడు పోలీసులను ఆశ్రయించిన ఘటన ఏపీ బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం ఇస్లాంపేట పరిధిలో జరిగింది. సుభాని అనే వ్యక్తి రైస్ మిల్లులో పని చేస్తూ రోజూ తాగొచ్చి భార్య సుబాంభీని వేధించేవాడు. ఇది చూసిన రహీమ్ తన తండ్రికి బుద్ధి చెప్పాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో భార్యభర్తలను స్టేషన్ కు పిలిపించిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.