అకాల వర్షాలకు మిరప రైతులు పంట దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు పాటించలని ఉద్యాన శాఖ అధికారిణి ఉష తెలిపారు. కాకుమాను మండల పరిధిలోని బి. కే పాలెం, కాకుమాను, కొమ్మూరు గ్రామాలలో శుక్రవారం ఉద్యాన శాఖ అధికారిణి పర్యటించారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాలలో మిరప పంటను పరిశీలించి అధికారిణి ఉష మాట్లాడుతూ రైతులు పంట దెబ్బతినకుండా సాధ్యమయినంతవరకు ఏసీ గోడౌన్ లలో భద్రపరచుకోవాలని పంట నష్ట పోకుండా తగు సలహాలు, సూచనలు రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో ఆయా గ్రామాల రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.