పెందుర్తి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒప్పంగి వెంకటలక్ష్మి (35) ఈనెల 2 నుండి కనిపించడం లేదని ఆమె భర్త సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 2 న సాయంత్రం నాలుగు గంటలకు ఇంట్లో నుండి బయటకు వెళ్లిన వెంకటలక్ష్మి తిరిగి రాలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సీఐ గొలగాని అప్పారావు కేసు నమోదు చేసి హెడ్ కానిస్టేబుల్ ఎం. ప్రకాష్ బాబుకు దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు. ఆచూకీ తెలిసినవారు పెందుర్తి పోలీసులను సంప్రదించాలని ప్రకాష్ కోరారు.