రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడి అమెరికా హస్తం ఉందనే ఆరోపణలను వైట్‌హౌస్ కొట్టిపారేసింది. రష్యా ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉక్రెయిన్ సరిహద్దు దాడులను అమెరికా ఎప్పటికీ ప్రోత్సహించే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షభవనం ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్ పియర్ వెల్లడించారు. కాగా, ఇది హాస్యాస్పదంగా ఉందని యూఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బే చెప్పారు.