ఇండియన్ మార్కెట్‌పై యాపిల్ CEO టిమ్ కుక్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల ముంబై, ఢిల్లీ నగరాల్లో రెండు రిటైల్ స్టోర్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐఫోన్‌తో పాటు యాపిల్ ఉత్పత్తులకు ఆదరణ పెరిగే అవకాశం ఉందన్నారు. కంపెనీ ప్రధానంగా విపణిపై దృష్టి సారించిందని, మూడు నెలల వ్యవధిలో యాపిల్ రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. యాపిల్ బ్రాండ్‌పై భారత్ ప్రజలకు ఆసక్తి ఉందని తెలిపారు.