ముఖ్యమంత్రి జగన్ ఏ స్కీమ్ ప్రవేశపెట్టినా అందులో స్కామ్ ఉంటుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. కమీషన్ల కోసమే ఎండీయూలో వాహనాల కొనుగోలుకు రూ.536 కోట్లు ఇచ్చారన్నారు. ఆపరేటర్లకు ప్రతి సంవత్సరం వేతనాల రూపంలో రూ.250 కోట్లు వృథా చేస్తున్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే ఎండీయూ వ్యవస్థను సమీక్షిస్తామన్నారు. ప్రజలకు, డీలర్లకు సౌలభ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటామన్నారు.