జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడిన సంగతి తెలిసిందే. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో మొత్తం ఐదుగురు జవాన్లు మరణించినట్టు ఆర్మీ తెలిపింది. ఉగ్రవాదులు సైనికులపై పేలుడు పదార్థం విసిరారని పేర్కొంది. కాగా ఇటీవల జమ్మూ రీజియన్‌లో ఆర్మీ ట్రక్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం విదితమే.