మూడేళ్ల కిందట చైనాలోని ఊహాన్ నుంచి వచ్చిన కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి నుంచి దేశాలన్నీ పూర్తిగా కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్‌పై కీలక ప్రకటన చేసింది. కొవిడ్-19 ఇకపై ప్రపంచ విపత్తు కాదని ప్రకటించింది. ప్రపంచ విపత్తుగా పరిగణించేంతటి స్థాయిలో దాని ప్రభావం లేదని వెల్లడించింది. అయితే మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని, ఇప్పటికీ అది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి ముప్పుగా ఉందని పేర్కొంది.